TG : 15లోగా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్!

Update: 2025-02-03 10:45 GMT

గ్రామ పంచాయతీ ఎన్నికలపై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టించి పనిచేయాలని కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో వెలువడుతుందని, ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 15వ తేదీ లోపు వెలువడుతుందని మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు.

Tags:    

Similar News