CM KCR : సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలో సర్పంచుల నిరసన

CM KCR : తమకు గతంలో చేసిన పల్లె ప్రగతి బిల్లులు రావడం లేదని, చిన్న పంచాయితీలకు నిధులు లేక అప్పులపాలైనామంటూ... ఆందోళనకు దిగారు సర్పంచులు.

Update: 2022-05-31 14:30 GMT

CM KCR : సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలోనే నిరసన చేపట్టారు సర్పంచులు. తమకు గతంలో చేసిన పల్లె ప్రగతి బిల్లులు రావడం లేదని, చిన్న పంచాయితీలకు నిధులు లేక అప్పులపాలైనామంటూ... ఆందోళనకు దిగారు సర్పంచులు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని తుప్రాన్‌ మండలంలో.. పల్లె ప్రగతి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి మండల పరిధిలోని 12 గ్రామాల సర్పంచులు హాజరయ్యారు. పల్లె ప్రగతి పనులు చేయలేమని తేల్చి చెప్పారు. గతంలో చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల పాలైనామన్న సర్పంచులు... సమీక్షా సమావేశాన్ని బహిష్కరించారు. నాలుగు విడుతలుగా చేసిన పల్లె ప్రగతి పనులకు అప్పులు చేసి వడ్డీలు కడుతున్నామన్నారు.

ఐదో విడత పల్లె ప్రగతి పనులు చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు సర్పంచులు. తమ ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. తమ సమస్యలు వినే నాయకులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News