రాష్ట్రంలో రెండో విడత రుణమాఫీకి రంగం సిద్ధమైంది. రేపు అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రెండో విడత రుణమాఫీ నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ నిధులను అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. రెండో విడతలో రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేయనున్నారు. రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులను జమచేయనుంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల్లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఓ సభలో తెలిపారు. హరీశ్ రావు ఆగస్టు లోపు రుణమాఫీ చేయాలన్న సవాల్‌ను స్వీకరించి మాఫీ చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో రూ.6,093 కోట్లను జమ చేశారు. రెండో విడతలో రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేయనున్నారు. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి మూడు విడతల్లో రూ.31 వేల కోట్లును రైతుల ఖాతాల్లో జమ చేస్తామని షెడ్యూల్ అన్నారు. కేవలం పాస్‌బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.