అన్ని శాఖల్లో ఉద్యోగులకు ప్రమోషన్లు ఎక్కడ? : బండి సంజయ్
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం బీజేపీ మాత్రమే అని, అందుకే పెద్ద సంఖ్యలో నాయకులు బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.;
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం బీజేపీ మాత్రమే అని, అందుకే పెద్ద సంఖ్యలో నాయకులు బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిజామాబాద్ రూరల్ జిల్లాకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని సంజయ్ మండిపడ్డారు. అన్ని శాఖల్లో ఉద్యోగులకు ప్రమోషన్లు ఎక్కడ అని ప్రశ్నించిన సంజయ్, వెంటనే ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ ప్రభుత్వం చేయకుంటే 2023లో బీజేపీ సర్కారు రాగానే వెంటనే ప్రమోషన్లు ఇస్తామన్నారు.