తెలంగాణ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారిని ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్ అయిన వెంటనే.. కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శాంతి కుమారి ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందనున్నారు. సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావును రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆర్థిక, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణ 1991 బ్యాచ్ అధికారి. తెలంగాణలో మూడవ సీనియర్-మోస్ట్ ఐఏఎస్ అధికారి. కాగా 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి తన సుదీర్ఘమైన కెరీర్‌లో అనేక కీలకమైన ప్రభుత్వ పదవులను నిర్వహించారు. వివిధ జిల్లాలకు కలెక్టర్‌గా, ఇతర ముఖ్యమైన పరిపాలనా పదవులు కూడా నిర్వహించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వైద్యారోగ్య శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆమె విశేష కృషి చేశారు. కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ, ఈ కీలకమైన రెవెన్యూ శాఖకు ఆమె కమిషనర్‌గా పనిచేశారు.