SHE Bharosa Cyberlab: మహిళలకు రక్షణగా మరో భరోసా..
SHE Bharosa Cyberlab: ఆరేళ్లలో మహిళలపై నేరాల కేసుల్లో 58 శాతం శిక్షలు పడ్డాయన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి.;
SHE Bharosa Cyberlab: ఆరేళ్లలో మహిళలపై నేరాల కేసుల్లో 58 శాతం శిక్షలు పడ్డాయన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి. మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో భరోసా సైబర్ ల్యాబ్‌తో పాటు ఎన్‌ఆర్‌ఐ కౌన్సిలింగ్ సెంటర్, మానవ అక్రమ రవాణా నిర్మూలన విభాగం, మిస్సింగ్ పర్సన్ మానిటరింగ్ సెల్‌ను ఏడీజీ స్వాతి లక్రాతో కలిసి ప్రారంభించారు. మహిళలు, పిల్లల భద్రత కోసమే ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎంతో కృషి చేస్తుందన్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను కంట్రోల్ చేస్తున్నామన్నారు.