ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు శేజల్;
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు శేజల్. దుర్గం చిన్నయ్య పోలీసులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీలో సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సీబీఐకి ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకే సీబీఐకి ఫిర్యాదు చేశానన్నారు. ఇక తనపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారని.. న్యాయం జరిగే వరకు ఢిల్లీలోనే ఉంటానని శేజల్ అన్నారు.