మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రత్యేక ప్లాన్.. 10 బహిరంగ సభలు.

Update: 2026-01-27 15:30 GMT

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతోంది. అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నేతలు. ఈ సారి పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో బలమైన సీట్లు సాధించి తమ పట్టు తగ్గలేదని.. ప్రభుత్వం మీదెలాంటి వ్యతిరేకత లేదని నిరూపించుకోడానికి కాంగ్రెస్ రెడీ అవుతోంది. అందులో భాగంగానే పురపోరుకు ప్రత్యేకమైన ప్లాన్ ను కూడా రెడీ చేసుకుంటున్నారు. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి మరోసారి భారీ బహిరంగ సభలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఈ సారి 10 బహిరంగ సభలు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరిగే ఏరియాల్లో ఐదు సంస్థలతో సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేయబోతున్నారు పార్టీ నేతలు. ఇప్పటికే ఆయా జిల్లాలకు మంత్రులను ఇన్ చార్జులుగా నియమించింది కాంగ్రెస్ పార్టీ. వారే ఆయా జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికల బాధ్యతలను మొత్తం తీసుకుంటున్నారు.

వారి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ భారీ ప్లాన్ చేసినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి 10 బహిరంగ సభలు పెట్టి ఎన్నికలను టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇలాగే బహిరంగ సభలు పెట్టి మంచి రిజల్ట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా బహిరంగ సభలతో అలాంటి రిజల్ట్ రాబట్టేందుకు సీఎం రేవంత్ స్కెచ్ వేశారు. మరి ఈ సభలతో ఏ మేరకు రిజల్ట్ సాధిస్తారో చూడాలి.

Tags:    

Similar News