KTR : కేటీఆర్ కు షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్.. సుప్రీంకు వెళ్లే ఆలోచన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు షాకింగ్ న్యూస్. ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో.. అభియోగాల కారణంతో కేటీఆర్ ను విచారణకు పిలిచి ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులకు వీలు చిక్కింది. హైకోర్టులో ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం ప్రకారం నడుచుకోవాలని కేటీఆర్‌కు హైకోర్టు సూచించింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని సూచించింది. దాంతో సుప్రీంకోర్టు వెళ్లే యోచన లో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నందినగర్ నివాసంలో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ అయ్యారు. కోర్టు తీర్పు నేపథ్యంలో నందినగర్‌కు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు.