పక్కా లోకల్ అంటున్న పార్టీలు.. పొత్తులతో సంబంధం లేదంట..

Update: 2026-02-17 07:55 GMT

తెలంగాణ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు అన్నీ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లోనే జరిగాయి. వాస్తవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఓటర్లు ఎవరికీ సరైన మెజార్టీ ఇవ్వట్లేదు. దాదాపు అన్ని పార్టీలకు దగ్గర దగ్గరగానే ఓట్ షేర్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను గెలుచుకున్నా.. చాలా చోట్ల హంగ్ రావడం ఇక్కడ విశేషం. ఇక హంగ్ వచ్చిన చాలా చోట్ల ప్రత్యర్థి పార్టీలు ఒక్కటైపోయాయి. కొన్ని చోట్ల బద్ధ శత్రువులైన కాంగ్రెస్-బీజేపీ ఒక్కటి కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇంకో చోట కాంగ్రెస్ తో బీఆర్ ఎస్ పొత్తు పెట్టుకుంది. ఇంకో చోట బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఇలా ఒకచోట మిత్రులుగా ఉంటే.. ఇంకో చోట మాత్రం ప్రత్యర్థులుగా మారారు.

అయితే ఈ పొత్తులతో పార్టీలకు సంబంధం లేదంటున్నారు అగ్ర నేతలు. అది కేవలం కౌన్సిలర్ల నిర్ణయం మాత్రమే అని.. వారి ఇష్టాలకు మేం వదిలేశాం అంటున్నారు. కానీ ఇక్కడ అగ్ర నేతలు ఒక విషయాలన్ని గుర్తుంచుకోవాలి. ఇవి పంచాయతీ ఎన్నికలు కావు. పార్టీ గుర్తులపై జరిగిన మున్సిపల్ ఎన్నికలు. పార్టీలతో సంబంధమే లేకపోతే.. అంత పెద్ద ఎత్తున క్యాంపు రాజకీయాలు ఎందుకు చేశారంటూ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరనేది అందరికీ తెలిసిందే కదా. అది ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి రుజువైంది. అందుకే పొద్దున లేస్తే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకునే పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో ఒక్కటైపోవడం నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:    

Similar News