ఆదిలాబాద్ రిమ్స్‌లో షాట్ సర్క్యూట్.. పేషెంట్ మృతి
పేరున్న ఆస్పత్రని, పెద్ద ఆస్పత్రిని, వైద్యులు సకాలంలో చికిత్స అందిస్తారని ఆయాస పడుతూ ఆస్పత్రికి వస్తే అక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.;
రోగులను కాపాడాల్సిన ఆస్పత్రులే.. వారి ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. వరంగల్ ఎంజీఎంలో కోవిడ్ వార్డులో విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్లు పనిచేయక కొవిడ్ బాధితుడు మృతిచెందాడు. మృతుడు వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలానికి చెందిన గాంధీగా గుర్తించారు. గత 25 రోజులుగా కొవిడ్‌కు చికిత్స పొందుతున్నాడు. ఈ ఉదయం విద్యుత్‌కు అంతరాయం ఏర్పడడంతో వెంటిలేటర్లు పనిచేయక మృతి చెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లోనూ అపర్ణ అనే పేషెంట్ మృతి చెందింది. ఎంఐసీయూ వార్డులో షాట్ సర్క్యూట్ కారణంగా ఏసీ స్టెబిలైజర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.. మరోవైపు మిగతా పేషెంట్లను ఇతర వార్డులకు తరలించారు.