నాగర్ కర్నూల్ లో ఓ SI దారుణానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవకు దిగారు. బంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పాట్‌కు చేరుకున్న ఎస్సై జగన్ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నాడు. అయితే తమ ముందు తల దువ్వుకున్నారనే కారణంతో ఎస్సై ఆ ముగ్గురు యువకులకు ఏకంగా శిరోముండనం చేయించాడని సమాచారం. ఈ క్రమంలో అందులో ఓ యువకుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐతే.. తన కొడుకు కోలుకుంటున్నాడని.. ఎస్సై తప్పేమీ లేదని అతడి తండ్రి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఘటనలో ఎస్సై తప్పు లేదని ఆయన్ను మీడియా తప్పుగా చిత్రీకరించొద్దని వేడుకున్నాడు.