ప్రముఖ టాలీవుడ్ సింగర్ రాహుల్ సిఫ్లిగుంజ్ సీఎం రేవంత్ రెడ్డి ను కలిశారు. జూబ్లిహిల్స్ లోని సీఎం నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ కు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శాలువ కప్పి రాహుల్ నుసత్కరించారు. ఆయనతో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు సీఎంను కలిశారు.
కాగా.., ఆర్ఆర్ఆర్ చిత్రంలో తను పాడిన 'నాటు నాటు' సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో దేశవ్యాప్తంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాపులర్ అయ్యారు. అయితే, 2023లో ఓ ప్రోగ్రామ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ సిప్లిగంజ్క కోటి రూపాయల నగదు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు జూలై 20న పాతబస్తీ బోనాల సందర్భంగా రాహుల్ కు కాంగ్రెస్ సర్కార్ రూ.కోటి ప్రోత్సాహకం ప్రకటించింది.