Sitarama Project : సీతారామ ప్రాజెక్ట్ మొదటి DPR ను అమలు చేయాలి

Update: 2025-05-20 08:15 GMT

గ్రెస్ ప్రభుత్వం మున్నేరు నీటిని పాలేరుకు తరలించేందుకు విడుదల చేసిన జీవో నెంబర్ 98 ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గార్ల పట్టణ కేంద్రంలో గోదావరి జల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా గోదావరి జల సాధన సమితి చైర్మన్ విశ్వ మాట్లాడుతూ.. 50 ఏండ్లుగా ప్రభుత్వాలు మున్నేరు ప్రాజెక్టును పెండింగ్ లో ఉంచి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. మున్నేరు ప్రాజెక్టును జీవోలకు, సర్వేలకు పరిమితం చేసి ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకు సాగు, త్రాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు రాకుండా చేసే కుట్రలో భాగంగానే మున్నేరు నీటిని సీతారామ కెనాల్ ద్వారా పాలేరుకు తరలించడానికి 98 జీవోను విడుదల చేస్తూ 162 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందన్నారు. జీవో నెంబర్ 98 ను రద్దు చేసి, మున్నేరు ప్రా జెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు సాగు, త్రాగు నీరు ఇచ్చేంత వరకు ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఎంఎల్ డెమోక్రసీ నాయకులు గుగులోత్ సక్రు, గౌని భద్రయ్య, సీపీఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, నాయకులు సాంగు నాగేంద్ర పవన్ కుమార్, టీజేఎస్ నాయకులు గిన్నారపు మురళి తారక రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News