TG : కల్తీ మోమోస్ కేసులో ఆరుగురి అరెస్ట్

Update: 2024-11-02 10:30 GMT

కలుషితమైన మోమోస్ తిని ఒకరి మృతి, 20 మంది తీవ్ర అస్వస్థతకు గురైన కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ లోని నంది నగర్ సమీపంలోని సింగాడి కుంట స్టాల్ వద్ద మోమోస్ తిని 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. రేష్మ అనే మహిళ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పాడైపోయిన మోమోస్ తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ ద్వారా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోమోస్ నిర్వాహకులు అల్మాస్, సాజిద్ హుస్సేన్, మహమ్మద్ రైస్, మహమ్మద్ షారుక్, మహమ్మద్ హనీఫ్, మహమ్మద్ రజిక్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Tags:    

Similar News