Hyderabad : ట్యాంక్ బండ్ చుట్టూ స్కైవాక్

Update: 2025-02-12 10:30 GMT

హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ చుట్టూ స్కెవాక్ ప్రాజెక్టు నిర్మించాలని రేవంత్ సర్కార్ డిసైడైంది. టూరిజం పాలసీలో ఈ అంశాన్ని చేర్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గేమింగ్ జోన్లు, ఫుడ్ కోర్టులు, ఓపెన్ థియేటర్లు, మినీ థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు. 10 కిలోమీటర్ల పొడవు.. ఆరు మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ స్కై వాక్ లో వేరువేరు సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ టూరిజం పాలసీ 2025 లో భాగంగా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హుస్సేన్ సాగర్ చుట్టూ నిర్మించనున్న స్కైవాక్ ద్వారా పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ స్కైవాక్ ప్రాజెక్టుతో హుస్సేన్ సాగర్ అందాలను మరింత దగ్గరగా ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.

Tags:    

Similar News