కురుమూర్తి జాతరకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కురుమూర్తి స్వామి జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ స్పెషల్ బస్సులు హైదరాబాద్ నుంచి నడవనున్నాయని తెలిపారు. జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నారు. దీంతో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కురుమూర్తి జాత భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిననట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 1,8, 9 తేదీలలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ అందు బాటులో ఉంచునుంది. ప్రత్యేక బస్సులు ఎంజీబీఎస్, ఆరాంఘర్, మహబూబ్ నగర్ మీదుగా ఈ బస్సులు కురుమూర్తకి వెళ్తాయని, ఈ ప్రత్యేక బస్సుల్లో టీ జీఎస్ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్లను కల్పిస్తోందని అధికారులు వివరించారు. ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకుని కురుమూర్తి స్వామిని దర్శించు కోవాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది.