టెన్త్ విద్యార్థి హరీష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. మిగతా పరీక్షలు రాసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. హిందీ, ఇంగ్లీష్ పరీక్షలను హరీష్ సప్లిమెంటరీ రాసేందుకు అనుమతి ఇవ్వాల్సిందేనని ఆర్డర్స్ జారీ చేసింది. టెన్త్ పేపర్ లీక్ కేసులో హరీష్‌ను విద్యాశాఖ అధికారులు డిబార్ చేశారు. అయితే విద్యార్థిని పరీక్షలకు అనుమతించాలని కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. విద్యార్థి భవిష్యత్ దృష్ట్యా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చింది. విద్యార్థి హరీష్ తరుపున బల్మూరి వెంకట్ కోర్టుకు వెళ్లారు.