తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.. కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో ప్రభుత్వం కీలక మార్పులు..;
తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.. కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రస్తుతానికి వాయిదా వేసింది.. ప్రభుత్వ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్లలో చలాన్ ఆప్షన్‌ను ప్రస్తుతానికి హైడ్ చేశారు అధికారులు. మరోవైపు వీఆర్వో వ్యవస్థ రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు వీఆర్వోల దగ్గర్నుంచి రికార్డులను వెనక్కు తీసుకుంటున్నారు.. వీఆర్వోలంతా తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి రికార్డులను సరెండర్ చేస్తున్నారు.