తెగిపోయిన అప్పచెరువు కట్ట.. హైదరాబాద్ - బెంగళూరు మధ్య నిలిచిపోయిన రాకపోకలు
శంషాబాద్ గగన్‌పహాడ్ వద్ద అప్పచెరువు కట్ట తెగిపోవడంతో.... హైదరాబాద్ - బెంగళూరు మధ్య నిలిచిపోయాయి. వరద నీటిలో 25 వాహనాలు కొట్టుకుపోగా... ముగ్గురు మరణించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని కలెక్టర్ అమోయ్ కుమార్ సమీక్షించారు. బెంగళూరు వెళ్లే వాహనదారులు ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాలని సూచించారు. గగన్‌పహాడ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.