ఇంటర్ ఫెయిలైన విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బైపీసీ చదువుతున్న అరుంధతి(17) రిలీజైన ఇంటర్ ఫలితాల్లో బోటనీలో ఫెయిల్ అయింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కాసేపటికి కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పరీక్షలో ఫెయిల్ అయిన మనస్తాపంతోనే ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు తీవ్ర మనస్థాపానికి గురైన బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న సుమతి, రామకృష్ణల కూతురు నిష్ఠ (16).. కెమిస్ట్రీలో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి వరకూ కళ్లముందే ఉన్న తమ కూతురు విగతజీవిగా మారడంతో రామకృష్ణ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.