Jagityal: సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు డబ్బులు ఇవ్వలేదని బాలుడి ఆత్మహత్య..
Jagityal: సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు డబ్బులు ఇవ్వలేదని.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ స్కూల్ విద్యార్థి.;
Jagityal: జగిత్యాలలో దారుణం చోటుచేసుకుంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు డబ్బులు ఇవ్వలేదని.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ స్కూల్ విద్యార్థి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురానిపేటలో ఈ ఘటన జరిగింది. 8వ తరగతి చదువుతున్న నవదీప్.. భీమ్లానాయక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు 300 రూపాయలు ఇవ్వాలని తండ్రిని కోరాడు. తన స్నేహితులు ముందే టికెట్లు బుక్ చేసుకుంటున్నారని తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి, డబ్బులు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వమని తండ్రి అనడంతో.. మనస్తాపానికి గురైన నవదీప్.. రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘనటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరిస్తున్నారు.