Siddipet: 'మా నాన్న ఎంపీటీసీ నన్నే అడ్డుకుంటారా': ట్రాఫిక్ పోలీసులతో బాలుడు..
Siddipet: సిద్ధిపేటలో ట్రాఫిక్ పోలీసులకు విచిత్ర సంఘటన ఎదురైంది.;
Siddipet: సిద్ధిపేటలో ట్రాఫిక్ పోలీసులకు విచిత్ర సంఘటన ఎదురైంది. శ్రీ చైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలుడు స్కూటీపై బ్యాగు వేసుకుని పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో.. పాత బస్టాండ్ వద్ద పోలీసులు ఆపారు. అనంతరం ఎక్కడికి వెళ్తున్నావని పోలీసులు ప్రశ్నించగా.. మా నాన్న MPTC నన్నే ఆపుతారా అంటూ బాలుడు సమాధానం ఇచ్చాడు. దీంతో అవాక్ అయిన పోలీసులు.. బాలుడి తండ్రికి ఫోన్ చేసి.. పిల్లలకు బండి ఇవ్వకూడదని కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇది రిపీట్ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలుడి బంధువులను పిలిచి బండిని అప్పగించారు.