JNTUH: జెఎన్టీయూ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్..
JNTUH: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జెఎన్టీయూ వద్ద ఉద్రిక్తత నెలకొంది.;
JNTUH: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జెఎన్టీయూ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గత సెమీస్టర్‌లో ప్రవేశపెట్టిన క్రెడిట్ డిటెన్షన్, గ్రేస్ మార్కులు వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విధ్యార్థులు... జెఎన్టీయూ మెయిన్ గేట్ వద్ద ధర్నాకు దిగారు. గత సెమీస్టర్‌లో ప్రవేశపెట్టిన నూతన విధానంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థులు వాపోయారు. నిరసనకు దిగిన విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి విద్యార్థులను చెదరగొట్టారు. అరెస్ట్ చేసి వ్యాన్లలో స్టేషన్ కు తరలించారు.