హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. భారీ వర్షం దంచికొట్టింది. బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో రాబోయే 3 రోజులు ఇలాంటి వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉప్పల్, రామాంతాపూర్, చిలుకానగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఓయూ క్యాంపస్, నారపల్లి, పోచారం, ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూకట్ పల్లి, వివేకానంద నగర్, జేఎన్టీయూ, ప్రశాంత్ నగర్, హెచ్.ఎం.టి హిల్స్ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఆర్.కెపురం, సైనిక్‌పురి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం అకస్మాత్తుగా ముంచుకురావంతో హైదరాబాదీలు అప్రమత్తమయ్యారు.