SUMMIT: తెలంగాణ సమిట్.. తొలి రోజే భారీ పెట్టుబడులు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్, తొలిరోజే సిక్స్.. రూ. లక్ష కోట్ల పెట్టబడికి 'ట్రంప్' కంపెనీ రెడీ
నిర్ణీత లక్ష్యాలు నిర్దేశించుకొని తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. 2047లోగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్నదే లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్నుగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సదస్సు ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినీనటుడు నాగార్జున తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. మహిళా రైతులను పలు విధాలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ‘‘ బస్సుల నిర్వహణ కూడా మహిళా సంఘాలకు ఇచ్చాం. వికసిత్ భారత్ దిశగా వేగంగా తెలంగాణ అడుగులు వేస్తోంది. మాది.. స్థిరమైన, పారదర్శక ప్రభుత్వం అన్నారు.
ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ వచ్చే పదేళ్లలో రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పోరేషన్ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు. మరోవైపు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థ కూడా రూ. 25 వేల కోట్లతో గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకిటంచింది. కాగా ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ సదస్సును తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ రైజింగ్ సమిట్ వేదికగా తెలంగాణలో భారీ పెట్టుబడులు ప్రకటించింది ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ. ఈ మేరకు ఈ కంపెనీ డైరెక్టర్ ఎరిక్.. వచ్చే పదేళ్లలో రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటన చేశారు.
తెలంగాణ విజన్‌ను ఈ సమిట్ ప్రతిబింబిస్తోందని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ అన్నారు. తెలంగాణలో ఇప్పటికే అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. ‘‘ గ్రీన్ డేటా సెంటర్స్, రెన్యువబుల్ ఎనర్జీలో ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నాం. సిమెంట్ రంగంలో కూడా అదానీ గ్రూప్ పెట్టుబడులు పెడుతోంది. డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. దేశంలో తొలిసారిగా యూఏవీ టెక్నాలజీ హైదరాబాద్‌లో రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌లో తయారయ్యే యూవీలను సైన్యానికి అందిస్తాం. ప్రపంచమార్కెట్లోనూ విక్రయిస్తాం. రూ.25వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం. లాజిస్టిక్స్‌లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోంది. రూ.4వేల కోట్లతో రహదారి సౌకర్యాలు కల్పించనున్నాం. రాష్ట్రంలో జిల్లాలను కలిపే రహదారులను అదానీ గ్రూప్ నిర్మిస్తోంది.