మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్ లోని కందుకూరు మండలం ముప్పల గ్రామానికి చెందిన రాంబాబు, ప్రశాంతి (22) లకు సంవత్సరం కిందట వివాహం జరిగింది. వీరికి ఐదు నెలల పాప కూడ ఉంది. నెలరోజుల కిందట మేడ్చల్లోని కేఎల్ఆర్ వెంచర్లో అద్దెకు దిగారు.
రాంబాబు మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వీరి బంధువులు ఇంటికి వెళ్లేసరికి ప్రశాంతి శవమై కనిపించింది. పక్కనే పాప ఏడుస్తోంది ..విషయం తెలుసుకున్న బంధువులు భర్త రాంబాబుకి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని.... భర్త రాంబాబు హత్య చేసి పారిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త హత్య చేశాడా లేదా మరెవరైనా హత్య చేసి పారిపోయారా అనే కోణం లో దర్యాప్తు చేపట్టారు.