Swine Flu : తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం

Update: 2024-09-05 09:15 GMT

ఇప్పటివరకూ విష జ్వరాలు రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తుండగా స్వెన్ ఫ్లూ వైరస్ కూడా పంజా విసురుతోంది. ప్రస్తుతం తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతోంది. రాష్ట్రంలో తాజాగా నాలుగు స్వెన్ ఫ్లూ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ తెలంగాణలో నాలుగు కేసులను నిర్ధారించింది.

స్వైన్ ఫ్లూ కేసులు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఫ్లూ మరింత వ్యాప్తి చెందకుండా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చాలా కాలం తర్వాత తెలంగాణలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. 2009, 2014లో తెలంగాణలో స్వెస్ ఫ్లూ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. దాదాపు దశాబ్దకాలం తర్వాత మళ్లీ తెలంగాణలో ఏకంగా నాలుగు కేసులు నమోదు కావడం ఇటు ప్రజలను అటు వైద్య, ఆరోగ్యశాఖను ఆందోళనకు గురి చేస్తోంది.

మాదాపూర్లో 23 ఏళ్ల యువకుడికి, టోలిచౌకిలో 69 ఏళ్ల వృద్ధుడికి, నిజామాబాద్ లో ఒకరికి, హైదర్ నగర్ లో ఒక మహిళకు స్వైన్ ఫ్లూ లక్షణాలు బయట పడడంతో నలుగురి శాంపిల్స్ హైదరాబాద్ నారాయణగూడ ఐపీఎం ల్యాబ్ కు తరలించారు. ఆ శాంపిల్స్ కు సంబంధించి టెస్టులు నిర్వహించగా నలుగురికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ జరిగింది.

Tags:    

Similar News