T BJP: తెలంగాణ బీజేపీ కీలక సమావేశం
ఎమ్మెల్యేలతో టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి భేటీ హాజరైన ఎమ్మెల్యేలు ఈటల,రఘునందన్‌రావు ఎమ్మెల్సీ AVN రెడ్డి;
తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు ఎమ్మెల్సీ AVN రెడ్డి హాజరైయ్యారు. ఈ నెల 3 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. శాసనసభ, మండలిలో బీజేఎల్పీ,డిప్యూటీ ఎల్పీ ఎన్నిక పై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.
పార్టీ నుంచి రాజాసింగ్ సస్పెండ్ కావడంతో గత కొన్ని రోజులుగా బీజేఎల్పీ నేత పోస్ట్ ఖాళీగా ఉంది. అయితే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్‌కు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీనియర్ ఎమ్మెల్యే ఉన్న ఈటల బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడుగా ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు.ఇక మొదటిసారి ఎన్నికైన రఘనందనరావు కూడా తనకు ఏదో ఒక పోస్ట్ కావాలని అడుగుతున్నారు. అటు బండి సంజయ్ ఖాళీగా ఉంచిన బీజేఎల్పీ నేత పోస్ట్‌ను.. కొత్త అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భర్తీ చేస్తారా అన్న చర్చ టీబీజేపీ పార్టీలో నడస్తోంది.