Revanth Reddy: రేవంత్ రెడ్డిని కలిసిన క్రికెటర్ సిరాజ్

సీయం కి టీమిండియా జెర్సీని బహూకరించిన క్రికెటర్;

Update: 2024-07-09 08:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కలిశారు. టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు గాను సిరాజ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా జెర్సీని రేవంత్ రెడ్డికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News