పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఏ-1 ప్రవీణ్, ఏ-2 రాజశేఖర్, ఏ-4 డాక్య, ఏ-5 రాజేశ్వర్‌లను.. మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు. అటు.. ఏ-10 షమీమ్, ఏ-11 సురేష్, ఏ-12 రమేష్‌ల కస్డడీ పిటిషన్‌పై.. సోమవారం విచారణ చేపడతామని తెలిపింది. మొదటి కస్టడీలో నిందితులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. పూర్తి సమాచారం ఇవ్వడం లేదని.. నిందితులు చైన్ ప్రాసెస్‌పై నోరు మెదపడం లేదని సిట్ అధికారులు తెలిపారు. కేవలం ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పారని.. మిగతా వారి పాత్ర బయటపడాల్సి ఉందని సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.