జాతిపిత గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ స్పీకర్
అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జాతిపిత వర్ధంతి సందర్భంగా.. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, హోం మంత్రి మహమూద్ అలీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ కవిత, మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సహా పలువురు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజి పోరాటాలను, సేవలను నేతలు కొనియాడారు.