టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై... బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. దేశద్రోహ పార్టీ ఎంఐఎంతో టీఆర్‌ఎస్ స్నేహం చేస్తోందని అన్నారు. బీజేపీతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఆరేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. హామీల్ని విస్మరించిన టీఆర్‌ఎస్‌కు... జీహెచ్‌ఎంసీఎ ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేసారు బండి సంజయ్.