Telangana BJP : వ్యూహ రచనలో తెలంగాణ బీజేపీ.. మళ్లీ మోడీతో బహిరంగ సభ..
Telangana BJP : వచ్చే ఎన్నికాల్లో తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.;
Telangana BJP : భారతీయ జనతాపార్టీ తెలంగాణాలో పాగావేసేందుకు ప్లాన్ చేస్తోందా..? అందుకు జాతీయస్థాయి నేతలు రంగంలోకి దిగారా..? వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతోందా..? అవుననే అనిపిస్తోంది.... బీజేపీ తెలంగాణలో దూకుడు చూస్తుంటే. డబుల్ ఇంజన్ ప్రభుత్వం తేవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా మొన్న నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు, అనంతరం జరిగిన నిర్వహించిన బహిరంగ సభే నిదర్శనం. అయితే ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీని రాష్ట్రానికి రప్పించి.. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ శ్రేణులు.
వచ్చే ఎన్నికాల్లో తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా జాతీయస్థాయి నేతలు గ్రామాలల్లో పర్యటించడం.. సామాన్యుడిలా అందరితో కలిసిపోవడం వంటివి చేపడుతోంది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదికా అమృత్ మహోత్సవాన్ని ఏర్పాటుచేశారు.
తెలంగాణకు స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తవనున్నసందర్భంగా తెలంగాణ ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని ఏడాది పాటు నిర్వహించేందుకు బీజేపీ యోచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే సెప్టెంబర్ 17న ప్రధాని మోదీతో భారీ బహిరంగ సభకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ సభకు బూత్ స్తాయి కార్యకర్తలు, అధ్యక్షులను ఆహ్వానించాలని నిర్ణయించారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామంటున్న బీజేపీ ఆదిశగాముందకు సాగుతోంది.
విమోచన దినోత్సవాన్ని తెలంగాణ విముక్తి దినోత్సవంగా నిర్వహించాలని సమాలోచనలు చేస్తున్నారు. 2023 సెప్టెంబర్ నాటికి అసెంబ్లీ ఎన్నికలొస్తాయని భావిస్తున్న బీజేపీ నేతలు... దేశ స్వాతంత్ర్య దినోత్సవం తరహాలోనే తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. మొత్తం మీద తెలంగాణాలో టీఆర్‌ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూనే.. నిత్యం జనంలో ఉండేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ.