Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం..
మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీహాల్‌లో కేబినెట్ భేటీ..;
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్-1లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఆర్‌ఓఆర్, పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. శాసనసభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించేలా పంచాయితీరాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించనుంది.
మరోవైపు రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసే ఛాన్స్ ఉంది. వీటిపై శాసనసభో చర్చ నిర్వహించనుంది. ఇక యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ సమర్పించిన విచారణ నివేదికను రాష్ట్ర మంత్రి వర్గం పరిశీలించి శాసనసభో ప్రవేశపెట్టేందుకు అనుమతించనుంది. ‘ఫార్ములా ఇ’ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.