రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం
శుక్రవారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం ఉంటుంది..;
శుక్రవారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం ఉంటుంది. కరోనా ప్రభావంతో 52 వేల 750 కోట్ల ఆదాయం కోల్పోతున్నందున.. మరోసారి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఏ పథకాలకు ఎంతెంత ఖర్చు పెట్టాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు. ధాన్యం కొనుగోలు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, ధరణి వెబ్‌సైట్ లోటుపాటులపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా దుబ్బాక ఫలితం రిపీట్ అయ్యే అవకాశం ఉన్నందున.. ఈ క్యాబినెట్ మీటింగులో ఈ అంశంపై కూడా సమీక్షించనున్నారు.