KCR : కేంద్రానికి రోగం వచ్చింది..చికిత్స చేయాలి: సీఎం కేసీఆర్
KCR : తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతుంటే... దేశమంతా ఇప్పుడు చీకటి అలుముకుందంటూ కేంద్రంపై మండిపడ్డారు సీఎం కేసీఆర్.;
KCR : తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతుంటే... దేశమంతా ఇప్పుడు చీకటి అలుముకుందంటూ కేంద్రంపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. చిన్నారుల చేతుల మీదుగా రంజాన్ తోఫాను అందజేశారు. కేంద్రం, రాష్ట్రం బాగుంటేనే దేశం బాంగుందన్నారు. కేంద్రానికి రోగం వచ్చిందని... ఇప్పుడు చికిత్స చేయాలన్నారు. కూల్చివేతలు సులువని... దేశాన్ని నిర్మించడమే కష్టమన్నారు. తెలంగాణలో అల్లరి చేసేవాళ్ల ఆటలు సాగవన్నారు సీఎం కేసీఆర్.