KCR : ఇది ఇలా కొనసాగితే దేశం కోలుకునేందుకు వందేళ్లు పడుతుంది: కేసీఆర్
KCR : మత రాజకీయాలు చేసి తుచ్ఛమైన రాజకీయ లబ్ధి పొందడం తప్ప బీజేపీకి ఇంకేమీ తెలియదని మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్.;
KCR : మత రాజకీయాలు చేసి తుచ్ఛమైన రాజకీయ లబ్ధి పొందడం తప్ప బీజేపీకి ఇంకేమీ తెలియదని మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీజేపీ ఎన్నికలున్న రాష్ట్రాల్లో అల్లర్లు సృష్టించి లబ్ధి పొందుతోందన్నారు. ఇలాంటి వైఖరితో దేశం వందేళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. దేశంలో పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు సీఎం.. దేశ రాజధానిలో 13 నెలల పాటు రైతులు ఉద్యమించారని గుర్తు చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టేందుకు కేంద్రం యత్నిస్తోందన్నారు.
రైతులకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పి సాగు చట్టాలను రద్దు చేశారని గుర్తు చేశారు. ఇక అటు జీవో నంబర్ 111ను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు చెప్పారు కేసీఆర్. జీవో నంబర్ 111 విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని...వాటిని తొలగించిన తర్వాత జీవో ఎత్తివేస్తామన్నారు. అటు తెలంగాణలో ఆరు ప్రైవేట్ యూనివర్శిటీలకు ఆమోదం తెలిపినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఫార్మా యూనివర్శిటీని తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.
కావేరి అగ్రికల్చర్ యూనివర్శిటీ, అమిటీ, సీఐఐ, గురునానక్, MNR యూనివర్శిటీలు రానున్నాయన్నారు. ఇక పెట్రోల్,డీజిల్‌పై తెలంగాణ వచ్చిన తర్వాత వ్యాట్ పెంచలేదన్నారు కేసీఆర్. ఒక్కసారి మాత్రం వ్యాట్ అడ్జస్ట్ చేశామన్నారు. కేంద్రం పన్నులు పెంచి...రాష్ట్రాలను తగ్గించాలనడం సరికాదన్నారు. బలమైన కేంద్రం-బలహీన రాష్ట్రాలు అన్న ఎజెండాతో కేంద్రం ముందుకెళ్తుందన్నారు.