Revanth Reddy : రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్?

Update: 2024-08-12 05:45 GMT

కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభావం తగ్గుతోందని, పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయం అని భావిస్తోంది. జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల ఇన్ఛార్జిలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో మంగళవారం ఏఐసీసీ సమావేశం కానుంది. ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశం... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆయా రాష్ట్రాల నేతలకు సూచించనున్నారు. రాజ్యసభ ఉప ఎన్ని కల్లోనూ గెలిచేలా దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఆ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి పీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు. ఇప్పటికే హస్తిన చేరుకున్న వైఎస్ షర్మిల ఆ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని ఇవాళ తెలంగాణకు వస్తారని తెలుస్తోంది.

ఒకవేళ సీఎం షెడ్యూల్ ప్రకారం 14న వస్తే కనుక.. పీసీసీ సమావేశానికి హాజరుకాబోరు. ఈ నెల 16 లేదా 17న ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసే చాన్సుంది. పీసీసీ అధ్యక్ష మార్పు అంశాన్ని ఫైనలైజ్ చేసే చాన్సుంది. రాజ్యసభ ఉప ఎన్నిక సైతం ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో అధిష్టానం మంతనాలు జరిపే ఛాన్స్ కూడా ఉంది. రాజ్యసభ అభ్యర్థి ఎంపిక విషయంపైనా క్లారిటీ వచ్చే చాన్సుంది.

Tags:    

Similar News