Telangana Congress : ఈ నెల 8న హైదరాబాద్ లో యువ సంఘర్షణ సభ
ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నేపథ్యంలో అనుబంధ సంఘాల ఛైర్మన్లతో సమావేశం నిర్వహించారు;
ఈనెల 8న హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరగనున్న యువ సంఘర్షణ సభ, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను విజయవంతం చేసేందుకు హస్తం నేతలు సమావేశం నిర్వహించారు.. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నేపథ్యంలో అనుబంధ సంఘాల ఛైర్మన్లతో సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదురి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.. అనుబంధ సంఘాలు సభ విజయవంతం చేసేందుకు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు.. యూత్ డిక్లరేషన్ నేపథ్యంలో అనుబంధ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.