కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరున్న ఖమ్మం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం మోగించనుంది హస్తం పార్టీ. కేసీఆర్ సర్కారును ఓడించడమే టార్గెట్‌గా ఇవాళ ఖమ్మంలో తెలంగాణ జనగర్జన పేరుతో భారీ బహిరగం సభ నిర్వహిస్తోంది. ఈ సభకు అగ్ర నేత రాహుల్‌గాంధీతో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు హాజరువుతున్నారు. సీఎల్పీనేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇవాల్టితో ముగుస్తుండటంతో... ఈ సభ ఏర్పాటు చేశారు. ఇదే సభలోనే ....... మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దీంతో కనివినీ ఎరుగని రీతులో.. సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.భారీగా జనసమీకరణ చేస్తున్నారు. సభకు 4నుంచి 5లక్షల మంది జనం వస్తారని అంచనా. ఇప్పటికే ఖమ్మంలో ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. సభా స్థలం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు కనబడేలా 50అడుగుల ఎత్తున భారీ డిజిటల్ స్ర్కీన్ ఏర్పాటు చేశారు.
రాహుల్ గాంధీ.... సాయంత్రం గన్నవరం చేరుకుని అక్కడనుంచి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు సభావేదికపైకి వస్తారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన భట్టి విక్రమార్కను రాహుల్‌గాంధీ సన్మానించనున్నారు. అదే వేదికపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. భద్రాద్రి జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తదితరులు.. కాంగ్రె్‌సలో చేరనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, కర్ణాటక మంత్రి బోసురాజు, ఇతర ముఖ్యనాయకులు ఈ సభలో పాల్గొననున్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సాయంత్రం 7 గంటలకు బయలుదేరి.. రాత్రి 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఖమ్మం జిల్లా నుంచే ఎన్నికల శంఖారవాన్ని పూరిస్తోంది కాంగ్రెస్. జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలుంటే.. 2018 ఎన్నికల్లో 8 స్థానాలను కాంగ్రెస్ కూటమే కైవసం చేసుకుంది. వైరాలోనూ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చేరికతో కాంగ్రెస్ మరింత బలంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ సభలో రాహుల్‌గాంధీ ప్రసంగం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.