తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 1873 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 360 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక్క రోజులో 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 24 వేల 963కు చేరింది. తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసులు 31వేల 299 కాగా కరోనా నుంచి కోలుకుని 92,837 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.