తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు సమ్మెలోకి వెళ్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఫీజ్ రియంబర్స్‌మెంట్, ట్యూషన్ ఫీజ్ చెల్లించడం లేదని.. సెమిస్టర్ పరీక్షు బైకాట్ చేస్తున్నట్లు కళాశాల యాజమాన్యాలు ప్రకటించాయి. నేటి నుంచే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. కళాశాల యాజమాన్యాలు బైకాట్ చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతన్నారు. అక్టోబర్‌లో నాలుగు రోజులు సమ్మె చేసినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని కళాశాల యాజమాన్యాలు మండిపడుతున్నాయి.