KTR : రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తోంది: కేటీఆర్

Update: 2024-07-19 05:47 GMT

తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ( Revanth Reddy ) ప్రారంభించింది. మూడు దఫాలుగా.. చేయనున్న ఈ రుణమాఫీని ఆగస్టు 15 లోపు ప్రభుత్వం పూర్తి చేసందుకు ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా.. ఈరోజు లక్ష రూపాయల మేర రుణాలు ఉన్న రైతుల అకౌంట్లతో డబ్బు జమ చేసింది. ఈ క్రమంలో.. రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తుండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పేరుతో.. మరోసారి రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

రైతు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి సర్కార్ అన్నదాతలను మోసం చేస్తోందని కేటీఆర్ తెలిపారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల్లో నుంచే 7000 కోట్లను రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంతమొత్తం విదిల్చి.. రుణమాఫీ చేస్తున్నామంటూ పోజులు కొడుతున్నారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 40 లక్షలకు పైగా రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారంటూ కేటీఆర్ నిలదీశారు.

Tags:    

Similar News