తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెప్టెంబర్ 22, 2025న సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా బోనస్‌ను ప్రకటించారు. ఈ బోనస్ మొత్తం ప్రతి కార్మికుడికి రూ. 1,95,610 చొప్పున ఇవ్వనున్నారు. ఈ బోనస్ నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. సింగరేణి సంస్థకు మొత్తంగా రూ.6,394 కోట్లు ఆదాయం రాగా.. అందులో రూ.819 కోట్లను కార్మికులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. గతంలో సింగరేణి సంస్థ 30 శాతం లాభాల వాటాను కార్మికులకు పంచుతుండేది. ఇప్పుడు దానిని 34 శాతానికి పెంచడం విశేషం. : ఈ నిర్ణయం వల్ల సుమారు 40,000 మందికి పైగా కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఇది వారికి ఆర్థికంగా పెద్ద ఊరట. ర్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్‌ను దీపావళికి పంపిణీ చేస్తాం. భవిష్యత్‌లోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్.