ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ బొగ్గులకుంటలోని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి.;
తెలంగాణ ప్రభుత్వం ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహించింది. హైదరాబాద్ బొగ్గులకుంటలోని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. దేవాయదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అతిథిగా, ప్రభుత్వ సలహాదారు రమణాచారి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు మంత్రి ఇంద్రకరణ్. ప్రముఖ పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ ప్లవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు.