Telangana: ప్రైవేట్ మెడికల్ షాపులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్.. ఇకపై ఆ ప్రాంతాల్లో ఉండకూడదు..!

Telangana: ప్రైవేట్ మెడికల్ షాపులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇవ్వబోతుంది.;

Update: 2022-04-12 01:45 GMT

Telangana: ప్రైవేట్ మెడికల్ షాపులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇవ్వబోతుంది. ఇక నుండి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలోని ప్రైవేట్ మెడికల్ షాపులు కనుమరుగు కానున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైద్యులే నేరుగా బ్రాండ్‌ పేర్లతో… బయటి మెడికల్‌ షాపులకు రాస్తున్నారు. ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారడమే కాకుండా.. రోగులపై ఆర్థిక భారం పడుతుంది. మెడికల్‌ షాపులతో వైద్యులు కుమ్మక్కవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సర్కార్‌ భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలో ఉన్న ప్రైవేట్‌ మెడికల్‌ షాపులను తొలగించనున్నారు. రోగులకు అవసరమైన మందులు TSMIDC ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తున్నప్పుడు...ప్రభుత్వ హాస్పిటలల్లో ఈ ప్రైవేట్ మెడికల్ షాపులు అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. డాక్టర్లు సదరు హాస్పిటల్లో ఉన్న మందులనే రాయాలి కానీ బయటి షాపుల్లో రాయడం వల్ల ఎవరికి లాభం అనే కోణంలో సర్కార్ ఆలోచిస్తోంది.

సర్కార్ తీసుకునే నిర్ణయంపై మెడికల్ షాప్ యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరం అనుకుంటే కొత్తవాటికి అనుమతులు ఇవ్వొద్దని....ఉన్నవాటిని కొనసాగించాలని కోరుతున్నారు. ఇక గాంధీ లాంటి కొవిడ్ హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాపుల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు.

హాస్పిటల్ కు 2 ఏళ్ల నుంచి రోగులు రాక, ఉన్న మందులు అమ్ముడు పొక... తీవ్రంగా నష్టపొయామన్నారు. ఇక మెడికల్ షాప్స్ తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరం అనుకుంటే ప్రభుత్వ హాస్పిటలల్లో ఇంకా స్టాక్ తెచ్చిపెట్టే యోచనలో సర్కార్ ఉంది. రోగులకు డాక్టర్లు బయటి మందులు రాయడం పట్లనైతే సీరియస్‌గా ఉంది 

Tags:    

Similar News