ఎస్సీ అభివృద్ధి శాఖలో 1,392 పోస్టుల కొనసాగింపుకు తెలంగాణ ప్రభుత్వ ఆమోదం తెలిపింది. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం 1,392 పోస్టులకు ఒక సంవత్సరం పాటు (01.04.2025 నుండి 31.03.2026 వరకు) సేవలను కొనసాగిస్తూ GO Rt. No.1450 ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని హాస్టళ్లు, ప్రీ–మెట్రిక్, పోస్ట్–మెట్రిక్ వసతిగృహాలు, ప్రత్యేక న్యాయస్థానాలు, జిల్లా కార్యాలయాల్లో సేవలు మరింత బలోపేతం కానున్నాయి.ఈ జీ.ఓ. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ దృక్పథానికి సాక్ష్యం. హాస్టళ్లలో సిబ్బంది లోటు భర్తీ కావడంతో విద్యార్థుల వసతి, ఆహారం, విద్య, భద్రత అన్ని రంగాల్లో నాణ్యత పెరుగుతుందని మంత్రి లక్ష్మణ్ అన్నారు .