Telangana : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. కోచింగ్‌తో పాటు రూ.1000...

Update: 2025-07-18 08:45 GMT

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయగా.. మరో లక్ష ఉద్యోగాల భర్తీ కి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు బీసీ స్టడీ సర్కిళ్లలో ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది. TGPSC, SSC, RRB, బ్యాంకింగ్, ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనుంది. డిగ్రీ లో మార్కుల ఆధారంగా కొందరు అభ్యర్థులను ఎంపిక చేసి వారికి నెలకు 1000 రూపాయల స్టైఫండ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 11 వరకు https://tgbcstudycircle.cgg.gov.in/FirstPa ge.do వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా టీజీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, ఇతర పోటీ పరీక్షలకు గాను 5 నెలల పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

కాగా, త్వరలోనే కొత్తగా లక్ష ఉద్యోగాలను సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తామని ఇటీవల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. . ముఖ్యంగా విద్యుత్, విద్య, ఆర్టీసీ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఫ్రీ కోచింగ్ ను అందించనున్నారు.

Tags:    

Similar News