TS Government : మద్యంప్రియులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్
TS Government : తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త అందించింది. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల వేళలు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.;
TS Government : తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త అందించింది. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల వేళలు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చింది. వేడుకల దృష్ట్యా ఈవెంట్ల నిర్వహణ వేళలు సైతం పొడిగించింది. ఒంటిగంట వరకు బార్లు, ఈవెంట్లు, టూరిజం హోటళ్లలో మద్యం వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి ఈవెంట్ల నిర్వహణకు అబ్కారీ శాఖ తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేస్తుంది. అయితే ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్యను బట్టి కనీసం 50వేలు ఉండగా 2.50 లక్షలు తాత్కాలిక లైసెన్స్ ఫీజుగా నిర్ణయించింది.